23, అక్టోబర్ 2013, బుధవారం

ఒక ప్రసిద్ధ సాహిత్య కారునిగా, నోబుల్ బహుమతి గ్రహీతగా రవీంద్రనాధ్ ఠాగూర్  మనందరికి పరిచయమేఅయితే ఆయన సాహిత్యకారునికంటే గొప్ప విద్యావేత్తఅందుకు నిదర్సనం ఆయన స్థాపించిన శాంతినికేతనే.  మన విద్యా వ్యవస్థమీద ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాలు అప్పటికి, ఇప్పటికి వర్తిస్థాయిఎందుకంటె అప్పటికి, ఇప్పటికి మన విద్యావ్యవస్థలో మార్పు లేదు కాబట్టిమన విద్యావ్యవస్థ మీద ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాలను కొన్నింటిని ఇక్కడ పరిశీలిద్దాం
·                     దేశవాసులను బాల్యం నుండి మనుషులుగా తయారు చేసే అవకాశాన్ని వెతికి దాని నుండి లాభం పొందక పోతే అన్ని విధాలా మనం సర్వనాశనమై పోతామన్న విషయాన్ని బాగా గుర్తించాలిఆకలితో చనిపోతాం, ఆరోగ్యం కోల్పోయి చనిపోతాం, మన బుధ్ధిని, చైతన్యాన్ని పోగొట్టుకొని చనిపోతాంఇందులో ఎంతమాత్రం సందేహం లేదు.    
·                     పరిపూర్ణమైన మానవుని రూపొదించడం విద్య ఉద్దెశం అనుకొంటె విద్య ద్వారా తమ భాద్యత గుర్తించే సౌశీల్యవంతులను తయారు చేయడం అభిమతమైతే ఆ విద్య ఇంటి దగ్గరగాని లేదా కేవలం పాఠశాలలోగాని లభించదు.
·                     మన శీలంమీద, మన వ్యహారిక జీవిత మీద ఎటువంటి ప్రభావం ఈ చదువు కలగచేయడం లేదుఈ రకమైన అసంపూర్నమైన జీవితం వల్ల భారతీయుల జీవితం ఒక నాటకంలా అనుకరణ మాత్రంగా తయారౌతోంది.
·                     ఏ చదువు నేర్వడానికి జీవితమంతా వెచ్చిస్తున్నామో అది కేవలం గుమాస్తాగాగాని లేదా మరొక నౌకరీ చేసుకోవటానికి మాత్రం యోగ్యులుగా తయారు చేస్తోందిఅంతకంటె మేలు దీనివల్ల జరగటం లేదుఈ చదువు నిత్య జీవితంలో ఏ మాత్రం ఉపయోగ పడడం లెదుఇదంతా మన విద్యా ప్రనాళిక పెట్టిన భిక్ష.
·                     మనం విద్యను ఎంత నిర్లక్ష్యం చేస్తామో మన విశ్వాసం అంతగా పెరిగి పోతుంది
·                     మన పిల్లలు పాఠశాలలో బెంచీల  మీద కూ్ర్చొని తమ బలహీనమైన కాళ్ళను ఊపుతూ గురువుగారి ఖటువైన తప్ప మరో మనోరంజకమైన మసాలా లేని బెత్తపు దెబ్బలు తింటూ ఉంటారు.  
·                     నీటిలో ఉండి దాహం తీరలేదు అన్నట్లుగా వుంది మన (విద్యావ్యవస్థ) పరిస్థితి.
·                     బాల్యనుండే రాయడం, చదవటంఅనే గానుగెద్దు పని ప్రారంభమవుతుంది.  ఈ విధమైన చదువుతో మానసిక సబంధం చాలా తక్కువనిజం చెప్పలంటే ఈ చదువులో ఆనందం లేదు
·                     పిల్లల మనసు గ్రహించగల్గినంత విద్య అది ఎంత తక్కువైనా సరే అది నిజమైన విద్యఏ పనికిరాని విద్య వారి మనసులను కప్పివేస్తుందో దాన్ని కేవలం చదవడం అనవచ్చు గానీ విద్య మాత్రంకాదు.
·                     మన శిక్షణా ప్రణాళిక ఎంత వ్యర్ధమైనది అంటే దానిచే ప్రభివితమైన మానసికవికాసంసజీవంగా ఉండదుకొంత మదికి ఈ విషయం తెలుసుకాని నమ్మరుచాలా మంది అర్ధం చేసుకొటారుఒప్పుకోరుకాని ఆచరనలోకి వచ్చే సరికి  మొదట్నుంచి ఏ పధ్ధతి జరుగుంతుందో అదే పధ్ధతి లో నడవడం ఉచితం అనుకొంటారుఎక్కడ ఉన్నావే గొంగళి అంటే వేసినచోటే ఉన్నట్లుగా ఉంటారు.


                                                                                   టి. వి. రామకృష్ణ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి